ఎన్నికలకు ముందే చంద్రబాబు తనవాళ్లకు పోస్టింగులు, ప్రమోషన్లు ఇచ్చేశారు!: విజయసాయిరెడ్డి

  • లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవడని టీడీపీకి తెలుసు
  • అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదు
  • అప్పులు చేసి మరీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన లోకేశ్ ఓడిపోతారని టీడీపీకి ముందే తెలుసని విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే లోకేశ్ చేత ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేయించలేదని విమర్శించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందే తనవాళ్లకు పోస్టింగులు, ప్రమోషన్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి మరీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారనీ, ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియడం లేదంటూ డ్రామాలు అడుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News